Gajulamandyam: గాజులమండ్యం ఓటర్ల మ్యాపింగ్‌పై ఆర్డీవో పరిశీలన
Gajulamandyam: శ్రీకాళహస్తి గాజులమండ్యంలో ఓటర్ల మ్యాపింగ్‌పై ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి పరిశీలన. 30 ఏళ్లుగా ఉంటున్న నేపాల్ కుటుంబాలతో ముఖాముఖి. వివరాల సేకరణ.
Gajulamandyam: గాజులమండ్యం ఓటర్ల మ్యాపింగ్‌పై ఆర్డీవో పరిశీలన
గాజులమండ్యం: రాష్ట్రంలో ఓటర్ల మ్యాపింగ్ గడువును భారత ఎన్నికల సంఘం ఈనెల 24వ తేదీ వరకు పొడిగించిందని శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. రేణిగుంట మండలం గాజుల మన్యంలో గత 30 సంవత్సరాలుగా స్థిరపడిన నేపాల్ దేశస్థుల ఓట్ల నమోదు ప్రక్రియలో సమస్యలు తలెత్తయి.
దీనిపై సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి,తాసిల్దార్ శ్రవణ్ కుమార్ తో కలిసి మంగళవారం స్థానిక సచివాలయాన్ని సందర్శించారు.
అక్కడ నివసిస్తున్న నేపాల్ కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక బిఎల్వోలతో కలిసి వారి వద్ద ఉన్న వివిధ అడ్రస్ ప్రూఫ్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆర్డీవో తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ముని చంద్రారెడ్డి,వీఆర్వో విశ్వనాథం,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




