Srikalahasti: శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో రెండో రోజు నల్ల బ్యాడ్జీల నిరసన

Srikalahasti: ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో ఉద్యోగుల నల్ల బ్యాడ్జీల నిరసన. పీఆర్సీ, డీఏ, ఐఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 2 Sept 2026 3:20 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో రెండో రోజు నల్ల బ్యాడ్జీల నిరసన

Srikalahasti: శ్రీకాళహస్తి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐదు రోజుల నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో ఉద్యోగులు రెండో రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు తమకు రావాల్సిన PRC, DA, IRలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న అలవెన్సులు, సరెండర్ లీవుల బకాయిలను సత్వరమే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.ఎస్. కుమార్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సి. మధు, జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ పి. నరసింహులు పాల్గొని ఉద్యోగులకు మద్దతు తెలిపారు. శ్రీకాళహస్తి డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ పి. రమేష్ బాబు, డిపో సెక్రెటరీ లింగమూర్తి, గ్యారేజ్ అధ్యక్ష, కార్యదర్శులు మురళి, రోశయ్యతో పాటు పలువురు డిపో ముఖ్య నాయకులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు.

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story