Srikalahasti: బడి బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరి: రవాణా శాఖ
Srikalahasti: శ్రీకాళహస్తిలో పాఠశాల బస్సుల భద్రతపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Srikalahasti: బడి బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరి: రవాణా శాఖ
Srikalahasti: రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాల బస్సులపై తనిఖీలు ప్రారంభించామని అధికారులు తెలిపారు. అన్ని పాఠశాల బస్సులు సకాలంలో రిపేర్లు చేయించుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు.
ఇప్పటికే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్న వాహనాలను ఈరోజు తనిఖీ చేశారు. కొత్త బస్సులకు రెండు సంవత్సరాల వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. ఈ మధ్యకాలంలో ఏవైనా లోపాలు ఉంటే, నిబంధనల ప్రకారం రిపేర్లు చేయించి వచ్చే విద్యా సంవత్సరానికి వాహనాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
ఈరోజు మొత్తం 10 వాహనాలను తనిఖీ చేయగా, అందులో 3 వాహనాలు మోటారు వాహనాల నిబంధనలకు అనుగుణంగా లేవని గుర్తించారు. ఆ వాహనాలను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రిపేర్లు చేయాలని ఆదేశించారు.
కావున, పాఠశాలల యాజమాన్యాలు తమ వాహనాలను మోటారు వాహనాల నిబంధనలకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.




