Srikalahasti: శ్రీకాళహస్తి రూరల్‌లో పోలింగ్ కేంద్రాల పరిశీలన: సీఐ
Srikalahasti: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి రూరల్ సీఐ ఆధ్వర్యంలో వేడం, రామాపురం సహా పలు గ్రామాల పోలింగ్ కేంద్రాలను ఆదివారం పరిశీలించారు.
Srikalahasti: శ్రీకాళహస్తి రూరల్‌లో పోలింగ్ కేంద్రాల పరిశీలన: సీఐ
శ్రీకాళహస్తి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
వేడం, రామాపురం, కె.వెంకటాపురం, బొక్కసంపాళెం, రామలింగాపురం, సుబ్బానాయుడు కండ్రిగ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ కల్పించిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలపై వివరాలు సేకరించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు.




