Srikalahasti: వైఎస్సార్ విగ్రహానికి బియ్యపు శ్రీవాణి రెడ్డి పాలాభిషేకం
Srikalahasti: వైఎస్సార్ సర్కిల్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించిన బియ్యపు శ్రీవాణి రెడ్డి మరియు నేతలు.
Srikalahasti: వైఎస్సార్ విగ్రహానికి బియ్యపు శ్రీవాణి రెడ్డి పాలాభిషేకం
Srikalahasti: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, ముఖ్యమంత్రిగా పేదల సంక్షేమానికి అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేశారని గుర్తుచేశారు.
ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పక్కా గృహాల వంటి సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదల జీవితాల్లో వైఎస్సార్ వెలుగులు నింపారని కొనియాడారు. వైఎస్సార్ చూపిన బాటలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా పేద ప్రజలకు అండగా నిలిచి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, మాజీ బోర్డు సభ్యులు మున్నా రాయల్, పగడాల రాజు, కొత్తపాటి శ్రీనివాసులు రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సూర సురేష్ రాయల్‌తో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను, సంక్షేమ పాలనను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.




