Srikalahasti: రాష్ట్రస్థాయి సిలంబం ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాళహస్తి విద్యార్థుల ప్రతిభ!

Srikalahasti: నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి సిలంబం ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాళహస్తి విద్యార్థులు రెండు బంగారు, ఒక రజత పతకం సాధించి ఘన విజయం సాధించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 28 Sept 2026 10:23 AM IST
Srikalahasti
X

Srikalahasti: రాష్ట్రస్థాయి సిలంబం ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాళహస్తి విద్యార్థుల ప్రతిభ!

Srikalahasti: రాష్ట్రస్థాయి సిలంబం ఛాంపియన్‌షిప్‌–2026లో శ్రీకాళహస్తికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నెల్లూరులోని సోమిశెట్టి కళ్యాణ మండపంలో సిలంబం అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ముగ్గురు విద్యార్థులు పాల్గొని మూడు పతకాలు సాధించారు.

అండర్‌–14, మైనస్‌ 50 కేజీల విభాగంలో జోషిత్ బంగారు పతకం సాధించగా, అండర్‌–14, మైనస్‌ 60 కేజీల విభాగంలో లిఖిత బంగారు పతకం కైవసం చేసుకుంది. అదేవిధంగా అండర్‌–14 విభాగంలో క్లారిసీ రజత పతకం సాధించి ప్రతిభను చాటింది.

ఈ విజయంతో శ్రీకాళహస్తి యువ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో తమ ప్రతిభను నిరూపించడంతో పాటు తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చారు. విజేతలను తల్లిదండ్రులు, కోచ్‌లు, నిర్వాహకులు అభినందించారు.

ఈ ఛాంపియన్‌షిప్‌కు సిలంబం అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కె. తనిగివేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సెక్రటరీ డాక్టర్ రenshi ధనుష్, ఇతర క్రీడా ప్రముఖులు, నిర్వాహకుల సమక్షంలో పోటీలు నిర్వహించారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి మరిన్ని విజయాలు సాధించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI