Srikalahasti: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: కూటమి పాలనపై శ్రీకాళహస్తి టీడీపీ నేతల ప్రశంసలు!
Srikalahasti: ఏపీలో కూటమి ప్రభుత్వ 23 నెలల పాలనలో సాధించిన విజయాలను శ్రీకాళహస్తి టీడీపీ నేతలు వివరించారు. సూపర్ సిక్స్ హామీలు, పెట్టుబడుల ఆకర్షణ మరియు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.
Srikalahasti: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: కూటమి పాలనపై శ్రీకాళహస్తి టీడీపీ నేతల ప్రశంసలు!
Srikalahasti: చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతోందని శ్రీకాళహస్తి నియోజకవర్గ టిడిపి నాయకులు పేర్కొన్నారు. గత 23 నెలల పాలనలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందని కొనియాడారు. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా “తల్లికి వందనం” పథకం ద్వారా 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10,090 కోట్ల సాయం అందించామని తెలిపారు. స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, దీపం-2 పథకాల ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు.
దీపం-2 పథకం కింద ఇప్పటికే 4 కోట్ల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతులకు మూడు విడతల్లో రూ.8,985 కోట్లు జమ చేశామని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అమలుకు రూ.63 వేల కోట్లు ఖర్చు చేసి సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూలంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
విశాఖపట్నం ఐటీ రంగ పెట్టుబడులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషకరమని అన్నారు. పరిశ్రమల ప్రోత్సాహానికి 28 నూతన పాలసీలు తీసుకువచ్చి, దేశంలో తొలిసారిగా ఎస్క్రో ఖాతాల వ్యవస్థ అమలు చేస్తున్నామని వెల్లడించారు. దేశ పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి రావడం చంద్రబాబు నాయుడు నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. CII సమ్మిట్ ద్వారా రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగ అవకాశాలు సాధించామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో MSME పార్కుల ద్వారా “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” లక్ష్యాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు టిడిపి, బిసి విభాగ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.




