Srikalahasti: రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేత.. పాలు, నీరు సరఫరా!
Srikalahasti: రెండో కార్తీక కోటి సోమవారం సందర్భంగా ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు.
Srikalahasti: రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు నిలిపివేత.. పాలు, నీరు సరఫరా!
శ్రీకాళహస్తి: రెండో కార్తీక కోటి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల రద్దీ భక్తులకు పాలు, మంచినీటి సరఫరా అంతరాలయ దర్శనాలు నిలిపివేత, ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో రెండో కార్తీక కోటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా నెలకొంది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆలయ అధికారులు పాలు, మంచినీటిని సరఫరా చేశారు. రద్దీ అధికంగా ఉండటంతో భక్తుల సౌకర్యార్థం నేడు స్వామి, అమ్మవార్ల అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. మరోవైపు మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ఈఓ బికే వేంకటేశులు మాట్లాడుతూ సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భక్తులకు తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తూ దర్శన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.




