Srikalahasti: 6న స్వర్ణముఖి నదిలో విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమం
Srikalahasti: శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6న 'స్వచ్ఛ స్వర్ణముఖి' పేరిట నది శుద్ధీకరణ కార్యక్రమం. పాల్గొనాలని భక్తులు, ప్రజలకు అధికారుల విజ్ఞప్తి.
Srikalahasti: 6న స్వర్ణముఖి నదిలో విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమం
శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ (సోమవారం) "స్వచ్ఛ స్వర్ణముఖి" ఉద్యమంలో భాగంగా స్వర్ణముఖి నదిలో విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్వర్ణముఖి నదిలో పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు, చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు తదితర వ్యర్థ పదార్థాలను తొలగించి నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు నదుల పరిశుభ్రతను కాపాడాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.
Next Story




