Srikalahasti: శ్రీకాళహస్తిలో దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 లక్షల సొత్తు రికవరీ!

Srikalahasti: శ్రీకాళహస్తిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.2 లక్షల విలువైన బంగారం వెండి వస్తువులు స్వాధీనం.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 25 Jun 2026 4:12 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 లక్షల సొత్తు రికవరీ!

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో జరిగిన చోరీల కేసులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జూన్ 24న శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

అరెస్టయిన వారిలో తిరుపతికి చెందిన ఏ. నవీన్, అలాగే కృష్ణగిరి జగదీష్ కుమార్ అలియాస్ జగదీష్ ఉన్నారు. విచారణలో వారు శ్రీకాళహస్తి, గంగాధర నెల్లూరు, తిరుచానూరు తదితర ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల వద్ద నుంచి 28 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, చెవి పోగులు, ముక్కుపుడక, ఉంగరాలు, వెండి గిన్నెతో పాటు చోరీలకు వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల మొత్తం విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

నిందితుల్లో ఒకరు గతంలో కూడా పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని పోలీసులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ప్రజలు తమ ఇళ్లలో భద్రతా చర్యలు పాటించాలని సూచించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story