Srikalahasti: జర భద్రం! తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. శ్రీకాళహస్తిలో దొంగల హల్చల్

Srikalahasti: శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీలో భారీ దొంగతనం. భక్తవచ్చల రెడ్డి ఇంటి తాళాలు పగలగొట్టి 10 సవర్ల బంగారం, ₹2 లక్షల నగదు అపహరణ.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 5 May 2026 10:32 AM IST
Srikalahasti
X

Srikalahasti: జర భద్రం! తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. శ్రీకాళహస్తిలో దొంగల హల్చల్

Srikalahasti: శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో గురూజీ వీధిలో చోరీ ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఇంటి యజమాని భక్తవచ్చల రెడ్డి దైవ దర్శనానికి వెళ్లి ఈరోజు ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి, ఇంటి తాళాలు, బీరువా తలుపులు పగలగొట్టబడినట్లు గమనించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు. దొంగలు బీరువాలో ఉన్న సుమారు 10 సవర్ల బంగారు నగలు, అలాగే రూ.2 లక్షల నగదును అపహరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story