Srikalahasti: మరింత మెరుగైన సేవలు.. కొత్త భవనంలోకి శ్రీకాళహస్తి టూ టౌన్ పీఎస్!

Srikalahasti: శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి మారింది.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 3 Jun 2026 11:41 AM IST
Srikalahasti
X

Srikalahasti: మరింత మెరుగైన సేవలు.. కొత్త భవనంలోకి శ్రీకాళహస్తి టూ టౌన్ పీఎస్!

Srikalahasti: శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనానికి మార్పు. ఇప్పటి వరకు నంది సర్కిల్ వద్ద కార్యకలాపాలు నిర్వహించిన టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఈరోజు నుంచి సీతాలమ్మ గుడి సమీపంలోని నూతన భవనానికి మార్చారు. మండల ప్రజలు పోలీసు సంబంధిత సేవలు, ఫిర్యాదులు మరియు ఇతర అవసరాల కోసం ఇకపై నూతన టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. పోలీస్ స్టేషన్ మార్పు విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని టూ టౌన్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నూతన ప్రాంగణంలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story