Srikalahasti: శ్రీకాళహస్తిలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ

Srikalahasti: కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 12 Jun 2026 9:02 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ

Srikalahasti: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా "చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.

మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పాత రామసేతు వంతెన (పాత బ్రిడ్జి) వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ వైయస్సార్ సర్కిల్ వరకు కొనసాగింది. పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు, మహిళలకు సంక్షేమం, రైతులకు భరోసా, పేదలకు అభివృద్ధి పేరుతో ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించారు.

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ పథకాలతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరిందని, ప్రస్తుతం ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని, ప్రజల తరఫున తమ పార్టీ ఎల్లప్పుడూ నిలబడుతుందని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story