Tirupati: నాయుడుపేట పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కుక్కల వీరంగం
Tirupati: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం గొట్టిప్రోలు ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో పాటు కుక్కలు మధ్యాహ్న భోజనం చేస్తున్న వైనం. ఆందోళనలో తల్లిదండ్రులు.
Tirupati: నాయుడుపేట పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కుక్కల వీరంగం
తిరుపతి: తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం గొట్టిప్రోలు గ్రామంలో నీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకాన్ని కుక్కలతో కలిసి సహభోజనం చేసే విధంగా అక్కడి మధ్యాహ్న భోజనం నడిపేవారు మరియు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేస్తున్నారు.
పాఠశాలలోకి కుక్కలు రావడంతో వాటిని నియంత్రించేవారు లేక విద్యార్థులు భోజనం చేసేటప్పుడు కుక్కలు కూడా విద్యార్థుల పక్కనే ఉంటూ వీలైతే అక్కడే కుక్కలు అన్నం కూడా తింటూ ఉండడం ఆనవాయితీగా ఆ పాఠశాలలో ఉన్నట్టుంది, మధ్యాహ్న భోజనం విద్యార్థులు పాఠశాలలో చేసేటప్పుడు కుక్కలు పాఠశాల లోపల తిరుగుతుండడం మరియు విద్యార్థులు భోం చేసేటప్పుడు పక్కనే ఉండడం విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అని కూడా అక్కడ ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు కనిపించడం లేదు.
కనీసం విద్యార్థులు భోంచేసేటప్పుడు అయినా అక్కడ ఉన్న సిబ్బంది చుట్టుపక్కల కుక్కలను విద్యార్థులు భోజనం చేసే వద్దకు రానివ్వకుండా నియంత్రించే ప్రయత్నం కూడా జరుగుతుండడం లేనట్టుంది, విద్యార్థులకు నిత్యం పాఠాలు బోధించే ఉపాధ్యాయులు విద్యార్థుల ఆరోగ్యం పై కూడా పాఠాలు బోధిస్తుంటారు, మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని నియంత్రించే ప్రయత్నం కనీసం ఉపాధ్యాయులు పట్టించుకో కపోవడంపై ఆ ఉన్నత పాఠశాలలోని సిబ్బందిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఒక పక్క కరోనా కేసులు ఎక్కువవుతున్న సమయంలో ప్రభుత్వాలు ప్రజలను ఆరోగ్యంపై జాగ్రత్త వహించండి అని నిత్యం తెలియజేస్తున్న పరిస్థితులలో గోట్టుప్రోలు లోని ఉన్నత పాఠశాలలో ఇలాంటి దృశ్యాలు ఎదురవుతుండడంతో అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటికే నిన్న జరిగినటువంటి మెగా పేరెంట్స్ సమావేశంలో విద్యార్థులు ఆ పాఠశాలలోని బాత్రూంలో పట్ల మరియు మధ్యాహ్న భోజనం పట్ల ఆ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు అధికారులకు వాటిను మార్చమని కనీసం బాత్రూంలో పెన్ ఆయిల్ వేసే పరిస్థితులు కూడా లేదని అలాగే మధ్యాహ్న భోజనం లో నాణ్యత లోపిస్తుందని కనీసం భోజనం చేయడానికి కూడా వీలు లేకుండా ఉంటుందని విద్యార్థులు తెలియజేశారు.
ఆ పాఠశాలలో అలాంటి పరిస్థితులలో ఇలాగ మధ్యాహ్నం భోజన సమయంలో కుక్కలు విహరించడం పై మరియు విద్యార్థులు భోం చేసేటప్పుడు పక్కనే ఉన్న అక్కడ ఉన్న సిబ్బంది గాని ఉపాధ్యాయులు గాని ప్రధానోపాధ్యాయులు కానీ పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి అవుతున్నారు,




