Tirupati: పేరూరు చెర్లోపల్లి రోడ్డులో చీకటి కష్టాలు ప్రయాణికుల ఆందోళన!

Tirupati: తిరుపతి రూరల్ పేరూరు నుండి చెర్లోపల్లి రోడ్డులో వీధి దీపాలు లేక చీకటిమయం. పెరిగిన ప్రమాదాలు, అధికారుల నిమ్మకు నీరెత్తిన వైఖరిపై స్థానికుల ఆగ్రహం.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 25 July 2026 7:15 AM IST
Tirupati
X

Tirupati: పేరూరు చెర్లోపల్లి రోడ్డులో చీకటి కష్టాలు ప్రయాణికుల ఆందోళన!

Tirupati: తిరుపతి రూరల్ మండలం, పేరూరు నుంచి చెర్లోపల్లి ప్రధాన రహదారిపై ప్రయాణించాలంటే వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మార్గంలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో రోడ్డంతా పూర్తిగా చీకటిమయంగా మారుతోంది. చీకటి పడితే చాలు ఈ దారిలో వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు.

కనీస వెలుతురు కూడా లేకపోవడంతో వాహనదారులు గుంతలను గుర్తించలేక ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానికులు, మహిళలు రాత్రి సమయాల్లో ఒంటరిగా నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా చీకటిని ఆసరాగా చేసుకుని అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందంటూ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​ఈ ఘోరమైన పరిస్థితిపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా, రాతపూర్వకంగా ఫిర్యాదులు చేసినా స్పందన కరువైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు, విద్యుత్ శాఖాధికారులు తక్షణమే స్పందించి, పెండింగ్‌లో ఉన్న వీధి దీపాల మరమ్మతు పనులను చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోకముందే ఈ చీకటి కష్టాల నుంచి విముక్తి కల్పించాలని వారు కోరుతున్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story