Sullurpeta: దావాదుగుంట చెరువులో శవమై తేలిన వ్యక్తి - దర్యాప్తు

Sullurpeta: సూళ్ళూరుపేట దావాదుగుంట చెరువులో అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన సెంట్రింగ్ కార్మికుడు రాజేష్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 26 Sept 2026 11:05 PM IST
Sullurpeta
X

Sullurpeta: దావాదుగుంట చెరువులో శవమై తేలిన వ్యక్తి - దర్యాప్తు

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా ​సూళ్ళూరుపేట పట్టణ పరిధిలోని దావాదుగుంట చెరువులో ఒక వ్యక్తి నీటిలో పడి మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దావాదుగుంట చెరువు వద్ద నీటిలో మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో సూళ్ళూరుపేట ఎస్సై జి. అజయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

​తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డిఎస్పీ జీ. చెంచుబాబు, సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో కేసు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మృతుడి అన్నయ్య, బంధువులను పిలిపించగా.. మృతుడు నాయుడుపేట మండలం బేరిపేట కాలనీకి చెందిన రాజేష్ (38)గా గుర్తించారు. మృతుడు సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

​మృతుడి అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి. అజయ్ కుమార్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta