Sullurpeta: 65 మందికి రూ.34.15 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Sullurpeta: సూళ్ళూరుపేటలో 65 మందికి రూ.34.15 లక్షల విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పంపిణీ చేశారు. ఇప్పటివరకు రూ.6.39 కోట్ల సాయం అందింది.

KKV Sudhakar, Sullurupeta
Published on: 10 Oct 2026 7:58 PM IST
Sullurpeta
X

Sullurpeta: 65 మందికి రూ.34.15 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

సూళ్ళూరుపేట: ​తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వివిద ఆస్పత్రుల్లో వైద్య చికిత్సలు పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా కొండంత ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు.

శనివారం స్థానిక సూళ్ళూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పత్రాలను నేరుగా అందజేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన 65 మంది లబ్ధిదారులకు సాయిపడిన మొత్తం రూ.34,15,234 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా పంపిణీ చేశారు. దీనితో పాటు అత్యవసరంగా మెరుగైన వైద్య చికిత్సలు పొందాల్సిన మరో ఇద్దరు లబ్ధిదారులకు రూ.4,09,802 విలువైన లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LOC) పత్రాలను అందజేసి బాధితుల కుటుంబాలకు ధైర్యాన్నిచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 738 మంది లబ్ధిదారులను గుర్తించి వారి వైద్య ఖర్చుల నిమిత్తం మొత్తం రూ.6,39,31,190 (రూ.6.39 కోట్లు) ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేసినట్లు వివరించారు. పేద ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన ఉచిత వైద్య సేవలు అందేలా చూడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

భారీ వైద్య ఖర్చుల కారణంగా ఏ ఒక్క పేద కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోకూడదు, ఇబ్బందులు పడకూడదు అనే బృహత్తర ఉద్దేశంతోనే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా త్వరితగతిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యున్నత ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేదవాడికీ ఈ సహాయం పూర్తిస్థాయిలో అందేలా నిరంతరం కృషి చేస్తామని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల నాయకులు, కూటమి కార్యకర్తలు, CMRF సాయం పొందిన లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta