Sullurpeta: సూళ్లూరుపేట అధికారులతో ఎమ్మెల్యే విజయశ్రీ విస్తృత సమీక్ష

Sullurpeta: సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ఆర్డీవో, డీఎస్పీ, ఇతర అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 28 Sept 2026 4:19 PM IST
Sullurpeta
X

Sullurpeta: సూళ్లూరుపేట అధికారులతో ఎమ్మెల్యే విజయశ్రీ విస్తృత సమీక్ష

​సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా, సూళ్ళూరుపేట నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు సంక్షేమ పథకాల అమలుపై నియోజకవర్గ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. సూళ్ళూరుపేట ఆర్డీవో దేవేంద్రరెడ్డి, నాయుడుపేట డిఎస్పీ జి. చెంచుబాబులతో పాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడటం, అంతర్గత రహదారుల పురోగతి, విద్యుత్ సమస్యల పరిష్కారం, రెవెన్యూ సంబంధిత అంశాలు మరియు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై శాఖల వారీగా ఆరా తీశారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

​ఆర్డీవో దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ నిరంతరం అందుబాటులో ఉంటుందని, పెండింగ్ పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. నాయుడుపేట డిఎస్పీ జి. చెంచుబాబు మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు పెంచుతామని వివరించారు.

​అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచాలని ఎమ్మెల్యే డా.నెలవల విజస్యశ్రీ సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta