Sullurupeta: సూళ్ళూరుపేటలో వేగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే!
Sullurupeta: సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మీడియా సమావేశంలో నియోజకవర్గ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించి, విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.
Sullurupeta: సూళ్ళూరుపేటలో వేగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే!
Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం 'ప్రజాదర్బార్' నిర్వహిస్తూ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన భూక్రమబద్ధీకరణ లోపాలను సరిదిద్ది రాజముద్ర కలిగిన పాస్‌బుక్కులను అందించడంతో భూసమస్యలు గణనీయంగా తగ్గాయని వివరించారు.
ఇళ్ల స్థలాల కేటాయింపును ఆన్లైన్ చేశామని, అక్టోబర్ 31 నాటికి ఎస్సీ, ఎస్టీ అర్హులందరికీ ఒకే చోట ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. అర్హులైన వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వైద్య అత్యవసరాల కోసం రూ. 6 కోట్ల CMRF నిధులు మంజూరు చేశామని తెలిపారు.
గ్రామీణ రోడ్ల అభివృద్ధికి 'పల్లె పండుగ' ద్వారా రూ. 27 కోట్లకు పైగా నిధులు కేటాయించామని, పట్టణాల మౌలిక వసతుల కోసం సూళ్ళూరుపేట రూ. 20 కోట్లు, నాయుడుపేటకు రూ. 21 కోట్లు (మొత్తం రూ. 41 కోట్లు) మంజూరు చేసి డ్రైనేజీలు, రోడ్ల పనులు వేగంగా చేపడుతున్నామని చెప్పారు. పట్టణ సుందరీకరణలో భాగంగా 'I Love Sullurupeta' ఐకాన్, వీధి నేమ్ప్లేట్లు, క్లాక్ టవర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సకల వసతులతో కూడిన టిట్కో ఇళ్లను ఓపెన్ చేసి పేదలకు అందించామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే చేసిన విమర్శలు, సవాళ్లపై తీవ్రస్థాయిలో స్పందిస్తూ.. "గత వైకాపా పాలనలో ఐదేళ్లపాటు టిట్కో ఇళ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. నాకు ఎవరికీ సవాళ్లు విసరాల్సిన అవసరం లేదు, దేవుడు ఎవరి చేతనైతే ఇళ్లను ఆపించారో, తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చాక మా చేతనే ఆ టిట్కో గృహాలను ఓపెన్ చేయించి పేదలకు ఇప్పించేలా చేశారు. మీరు నిజంగా సవాల్ విసరాలనుకుంటే ముందు ప్రజల్లోకి వెళ్లండి మీరేం చేశారో ప్రజలకు చెప్పండి" అని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
టిట్కో సముదాయంలో 11 రకాల వసతులు కల్పించామని, డ్రైనేజీలు, రోడ్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలను పరిష్కరించి రాబోయే మూడేళ్లలో సూళ్ళూరుపేట టౌన్లో ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.




