Sullurupeta: ఎమ్మెల్యే విజయశ్రీ బ్యాటింగ్ హంగామా క్రీడాకారుల్లో జోష్!

Sullurupeta: కొన్నెంబట్టులో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. పిచ్‌పై బ్యాట్ పట్టి ఫోర్లు కొడుతూ సందడి చేసిన పిసిబి.

KKV Sudhakar, Sullurupeta
Published on: 9 Aug 2026 4:22 PM IST
Sullurupeta
X

Sullurupeta: ఎమ్మెల్యే విజయశ్రీ బ్యాటింగ్ హంగామా క్రీడాకారుల్లో జోష్!

Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట మండలం కొన్నెంబట్టు గ్రామంలో క్రికెట్ జోష్ మామూలుగా లేదు! అక్కడ అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో సరికొత్త హంగామా నెలకొంది. ఈ పోటీలను స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

​ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అంటే కారులో రావడం, రిబ్బన్ కట్ చేసి ప్రసంగించి వెళ్ళిపోవడం చూస్తుంటాం. కానీ సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాత్రం దానికి పూర్తి భిన్నం! ఏమాత్రం హడావుడి లేకుండా, ఒక సాధారణ క్రీడాకారిణిలా మ్యాచ్ జరుగుతున్న చోటికి వెళ్లిన ఆమె.. నేరుగా పిచ్‌పైకి దిగి, చేతికి బ్యాట్ పట్టి ఫోర్లు కొడుతుంటే మైదానమంతా ఈలలు, కేరింతలు, చప్పట్లతో మార్మోగిపోయింది!

ఎమ్మెల్యే స్వయంగా పిచ్‌పై బ్యాటింగ్‌తో సందడి చేస్తూ, క్రీడాకారుల వద్దకు వెళ్లి మ్యాచ్ వివరాలు అడుగుతూ ఉత్సాహపరచడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఎమ్మెల్యే గారితో పాటు సూళ్ళూరుపేట సీఐ ఎం. మురళీకృష్ణ కూడా పిచ్‌పై బ్యాట్ పట్టి సందడి చేయగా, ఎస్సై గంటా అజయ్ కుమార్, ఇతర అధికారులు, నాయకులు ఈ ఆటాపాటను ఎంతగానో ఆస్వాదించారు.

​ఈ పోటీల్లో పాల్గొంటున్న సూళ్ళూరుపేట, కొన్నెంబట్టు జట్ల సభ్యులకు ఎమ్మెల్యే విజయశ్రీ ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. మైదానాన్ని, ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను ఎంతో చక్కగా, పకడ్బందీగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు జనార్ధన్ గారికి, వారి టీమ్ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. "ఆటలో గెలుపోటములు సహజం, రెండింటినీ సమానంగా స్వీకరిస్తూ స్పోర్టివ్‌గా ముందుకు సాగాలి.

మైదానంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా ఆడి తమ ప్రతిభను చాటుకోవాలి. చదువుతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ స్పోర్ట్స్ కోటా ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంలో డిఎస్సీ (DSC) నియామకాల్లోనూ క్రీడా కోటా ద్వారా ఎంతోమంది ఉద్యోగాలు సాధించారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులోనూ తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుంది" అని స్పష్టం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story