Sullurupeta: ఎన్నికల వేళ గొడవలు చేస్తే పీడీ యాక్ట్ తప్పదు: సీఐ మురళీకృష్ణ

Sullurupeta: ఎన్నికల వేళ అల్లర్లకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సూళ్ళూరుపేట సీఐ మురళీకృష్ణ రౌడీషీటర్లను హెచ్చరించారు. కోళ్లమిట్టలో కౌన్సిలింగ్ నిర్వహించారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 19 Oct 2026 5:11 PM IST
Sullurupeta
X

Sullurupeta: ఎన్నికల వేళ గొడవలు చేస్తే పీడీ యాక్ట్ తప్పదు: సీఐ మురళీకృష్ణ

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని కోళ్లమిట్టలో రౌడీషీటర్లకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ కౌన్సిలింగ్ నిర్వహించి ఎలక్షన్ల నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా, గొడవలకు తావులేకుండా శాంతిభద్రతలను కాపాడాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ జి.చెంచుబాబు ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ ఎన్నికల వేళ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచారు.

ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఎస్సై గంటా అజయ్ కుమార్, దొరవారిసత్రం ఎస్సై జీవి చౌదరి, తడ ఎస్సై కె.కొండప్ప నాయుడుతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పాల్గొని పట్టణంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో ఎవరైనా సరే గొడవల్లో పాల్గొన్నా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా ఉపేక్షించేది లేదని, వారిపై కఠినమైన పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని, చట్టాన్ని చేతిలోకి తీసుకునేవారిపై పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుందని ఆయన ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta