Renigunta: ఎస్వీబీసీ నూతన చైర్మన్ శ్రీధర్ వర్మకు రేణిగుంటలో ఘన సత్కారం!

Renigunta: నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బెతరాజు శ్రీధర్ వర్మను రేణిగుంట పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సత్కరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 10 Aug 2026 8:54 PM IST
Renigunta
X

Renigunta: ఎస్వీబీసీ నూతన చైర్మన్ శ్రీధర్ వర్మకు రేణిగుంటలో ఘన సత్కారం!

రేణిగుంట: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) నూతన చైర్మన్‌గా నియమితులైన బెతరాజు శ్రీధర్‌ వర్మను తెలుగుదేశం పార్టీ రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ వర్మకు గజమాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఎస్వీబీసీ చైర్మన్‌గా శ్రీధర్‌ వర్మ బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని మహబూబ్‌ బాషా పేర్కొన్నారు. శ్రీవారి భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు భక్తులకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. దేశ, విదేశాల్లోని శ్రీవారి భక్తులకు తిరుమల శ్రీవారి భక్తి, ధార్మిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను మరింత చేరువ చేయడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

శ్రీధర్‌ వర్మ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎస్వీబీసీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు. భక్తులకు నాణ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను అందించడంతో పాటు ఛానల్‌ ద్వారా మరిన్ని సేవా, ధార్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు జిపాళ్యం రాజశేఖర్‌ రెడ్డి, యూనిట్ ఇన్‌చార్జి కిరణ్‌, బాబు, చిన్న బాబు, వేణు, సంపత్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story