Tirupati: ఘనంగా 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం!
Tirupati: తిరుపతి రూరల్ మండలం కాలూరులో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tirupati: ఘనంగా 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమం!
Tirupati: కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమమే ముఖ్యమని, పేదల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి మనోహర్ చౌదరి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సిమల్లవరం గ్రామపంచాయతీ కాలూరు లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ఎమ్మెల్యే నాని చంద్రగిరి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు.
అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు, తల్లికి వందనం, దీపం, శ్రీ శక్తి, వంటి పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే నాని చొరవతో చంద్రగిరిలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారని చెప్పారు. మల్లవరం గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నవీన్ రాజ్, రవి, ఇంతియాజ్, షావలి అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.




