Sullurupeta: సూళ్ళూరుపేటలో ఘనంగా మహానాడు సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ

Sullurupeta: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో టీడీపీ మహానాడు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

KKV Sudhakar, Sullurupeta
Published on: 28 May 2026 7:28 AM IST
Sullurupeta
X

Sullurupeta: సూళ్ళూరుపేటలో ఘనంగా మహానాడు సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ

సూళ్ళూరుపేట: తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు సంబరాలు తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలో బుధవారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణ టిడిపి అధ్యక్షులు మరియు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలలో స్థానిక ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు స్థానిక వినాయకుని ఆలయం వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె కాలినడకన మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. వేదిక ప్రాంగణానికి చేరుకున్నాక తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు సమావేశాన్ని అధికారికంగా ప్రారంభించారు.

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ మాట్లాడుతూ, ప్రస్తుత యుద్ధ వాతావరణ కారణాల వలన దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు పూర్తిగా కట్టుబడి, ఎక్కడా ఆడంబరాలకు పోకుండా పొదుపు పాటిస్తూ నియోజకవర్గంలో ఈ మహానాడు సభలను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ "నా తెలుగుదేశం - నా బాధ్యత" అనే నినాదంతో ముందుకు సాగాలని, ఈ మహానాడును ఒక పండుగలా కాకుండా ఒక మహోద్యమంలా నిర్వహిస్తున్నామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, పట్టణ స్థాయి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని మహానాడు సంబరాలను విజయవంతం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta

Next Story