Tirupati: మోహిత్ రెడ్డిపై టీడీపీ నేత మనోహర్ ఫైర్
Tirupati: చంద్రబాబును విమర్శించే అర్హత మోహిత్ రెడ్డికి లేదు. హెరిటేజ్ కోసం రైతుల వద్ద కొన్న భూముల్లోనే ఫ్యాక్టరీ కట్టారని టీడీపీ నేత మనోహర్ చౌదరి అన్నారు.
Tirupati: మోహిత్ రెడ్డిపై టీడీపీ నేత మనోహర్ ఫైర్
తిరుపతి: నువ్వు పుట్టకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫ్యాక్టరీ కోసం రైతులకు వద్ద భూములను కొనుగోలు చేసి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారని, ముఖ్యమంత్రి విమర్శించే అర్హత మీకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మోహిత్ రెడ్డికి టిడిపి జిల్లా కార్యదర్శి మనోహర్ చౌదరి హితువు పలికారు. ఆయన ఆదివారం మీడియా
తో మాట్లాడారు.
భూమన కరుణాకర్ రెడ్డి తరహాలో చంద్రబాబు నాయుడు భూములు ఆక్రమించలేదని, రైతులకు డబ్బులు చెల్లించి భూములను కొనుగోలు చేసి హెరిటేజ్ ఫ్యాక్టరీని నిర్మించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన భూమన్ కరుణాకర్ రెడ్డి ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు తప్పు అని, మోహిత్ రెడ్డి ప్రజలకు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. హెరిటేజ్ ఫ్యాక్టరీ ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మాణం చేయలేదని పేర్కొన్నారు. మోహిత్ రెడ్డి 15 సంవత్సరాల వయసులోని దొంగ ఓటు నమోదు చేసుకుని ఓటు వేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను విమర్శించే అర్హత హక్కు మోహిత్ రెడ్డికి లేదని చెప్పారు. ఇకనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి బుద్ధితో ఆలోచించి చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి పథకాలకు స్వాగతం పలకాలని ఆయన కోరారు




