Thottambedu: తొట్టంబేడులో చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభం
Thottambedu: తొట్టంబేడు మండల పరిషత్ కార్యాలయంలో చెత్త సేకరణ కోసం ఎలక్ట్రిక్ ఆటోల ప్రారంభం. ఎమ్మెల్యే తల్లి బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.
Thottambedu: తొట్టంబేడులో చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభం
Thottambedu: తొట్టంబేడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో శుక్రవారం చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఆటోలను ఘనంగా ప్రారంభించారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, మండల అధ్యక్షుడు రావెళ్ల మునిరాజు నాయుడు ఈ ఆటోలను ప్రారంభించారు.
పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమంలో భాగంగా ముందుగా కొబ్బరికాయ కొట్టి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ లక్ష్యంగా మండలాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలు దోహదపడతాయని తెలిపారు. డీజిల్ వాహనాలతో పోలిస్తే కాలుష్యం తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చు కూడా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.సురేంద్రనాథ్,డిప్యూటీ ఎంపీడీవో భార్గవ్,గుడిమల్లం ఆలయ చైర్మన్ గిరి నాయుడు, మాజీ మండల అధ్యక్షుడు గాలి మురళి నాయుడు,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనంజయ నాయుడు, తంగేళ్లపాలెం సింగిల్ విండో బ్యాంక్ చైర్మన్ భీమల భాస్కర్ ముదిరాజ్ ,9 వ భూత్ యూనిట్ ఇంచార్జ్ లెక్కల. మురళి నాయుడు, సింగిల్ విండో చైర్మన్ భీమల భాస్కర్ ముదిరాజ్, మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి అలియాస్ సుబ్రహ్మణ్యం, సుధాకర్ యాదవ్, ఏజీపీ కమలాకర్, చేమూరు టిడిపి బూత్ కన్వీనర్ ముని, రాఘవరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు పవన్ నాయుడు, మళ్లీ గుంట ఎస్సి బూత్ ఇంచార్జ్ కే శంకర్ మండల అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




