Kanchanapalli: మామిడి తోటలో కోడిపందేల గుట్టురట్టు.. 40 బైక్‌లు సీజ్!

Kanchanapalli: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కంచనపల్లి గ్రామంలోని మామిడి తోటలో జరుగుతున్న కోడిపందేలపై బి.ఎన్. కండ్రిగ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 16 July 2026 10:22 PM IST
Kanchanapalli
X

Kanchanapalli: మామిడి తోటలో కోడిపందేల గుట్టురట్టు.. 40 బైక్‌లు సీజ్!

కాంచనాపల్లి: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కంచనపల్లి గ్రామ పరిధిలోని ఓ మామిడి తోటలో నిర్వహిస్తున్న కోడిపందేలపై బి.ఎన్. కండ్రిగ సర్కిల్ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు.

శ్రీకాళహస్తి డీఎస్పీ శ్రీ నరసింహమూర్తి గారి పర్యవేక్షణలో, బి.ఎన్. కండ్రిగ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో, తొట్టంబేడు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ మరియు సిబ్బంది ఈ దాడి చేపట్టారు. పోలీసులు చేరుకోగానే పలువురు పరారయ్యేందుకు ప్రయత్నించగా, 14 మందిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు.దాడిలో 7 కోడిపందెం కోళ్లు, 40 మోటార్ సైకిళ్లు, రూ.71,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో శ్రీకాళహస్తి రూరల్ మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున, రేణిగుంట మండలం మల్లవరం గ్రామానికి చెందిన నాగరాజ రెడ్డి ప్రధాన నిర్వాహకులుగా గుర్తించినప్పటికీ, వారు పోలీసులను గమనించి పరారైనట్లు అధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో వదిలివెళ్లిన ఇతర మోటార్ సైకిళ్ల యజమానులను కూడా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ ఘటనపై తొట్టంబేడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కోడిపందేలు నిర్వహించడం, వాటిలో పాల్గొనడం, నగదు పందాలు కాయడం చట్టవిరుద్ధమని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.అలాగే గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు, జూదం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలను కోరారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story