Srikalahasti: శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్న అజయ్ కుమార్

Srikalahasti: శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్న టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికిన దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 9 July 2026 4:29 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్న అజయ్ కుమార్

శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడ్కో చైర్మన్, జనసేన పార్టీ క్రమశిక్షణా చర్యల కమిటీ అధ్యక్షులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, దేవస్థానం తరఫున శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి పవిత్ర చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం బోర్డు సభ్యులు పగడాల మురళి, కొప్పెర్ల నాగరాజు, దేవస్థాన అధికారులు, సిబ్బందితో పాటు జనసేన పార్టీ నాయకులు జయప్రకాష్, ఢిల్లీబాబు, పర్వతాల హరికృష్ణ, లీలాధర్, రఘు తదితరులు పాల్గొన్నారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story