Tirupati: తిరుచానూరు శిల్పారామంలో వైభవంగా సాంస్కృతిక ప్రదర్శన
Tirupati: తిరుచానూరు శిల్పారామంలో ఘనంగా వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు. భరతనాట్య ప్రదర్శనతో అలరించిన శ్రీ విశ్వ శిఖర నాట్యాలయ విద్యార్థులు.
Tirupati: తిరుచానూరు శిల్పారామంలో వైభవంగా సాంస్కృతిక ప్రదర్శన
తిరుపతి: తిరుపతి రూరల్, తిరుచానూరు నగరంలోని శిల్పారామం వేదికగా వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన ప్రసిద్ధ ‘శ్రీ విశ్వ శిఖర నాట్యాలయ’ విద్యార్థులు ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ప్రముఖ గురువు డాక్టర్ వి. కృష్ణ ప్రియ రాఘవేందర్ (ఎమ్మెస్సీ., ఏం ఫీల్., పీహెచ్డీ.) పర్యవేక్షణలో కళాకారులు సాంప్రదాయ నృత్య రీతులతో అలరించారు. కార్యక్రమంలో భాగంగా పుష్పాంజలి, మల్లారి, గణపతి కవిత్వం, పిట్టుక్కు మన్ సుమంధు, అధివో అలదెనవో, ముద్దుగారే యశోద, పరమ పురుషుడు, బ్రహ్మం ఒకటే, ఆత్మ రామ, శ్రీ చక్రం, ఆనంద తాండవం, బొమ్మ బొమ్మ తా, శ్రీమన్నారాయణ, గోవర్ధన గిరి, దశావతారం వంటి మొత్తం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కీర్తనలకు కళాకారులు నృత్య రూపకాలు సమర్పించారు.
ఈ నృత్య ప్రదర్శనలో ధన్యశ్రీ, ధాత్రియ, ప్రియలక్ష్మి, వర్షశ్రీ, సుభాశ్రీ, హర్ష, యుతన్య, వర్షన, కనిష్క, భువనేశ్వరి, సాయి ఆరుషి, అక్షయ శ్రీ, శ్రేయ, నవ్య, హాసిని వెంకటేష్, సంజన, వెనిల్లా, లక్ష్మిత, రుద్ర, తియాషిని, లిషిత, యెన్షిక, జాషిక, సాషిని ,యువ కళాకారులు తమ అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.కార్యక్రమంలో శిల్పారామం పరిపాలన అధికారి ఖాదర్ వలి, సూర్య తేజ, శ్రీమతి పప్పీ, వెంకటేశ్వర రెడ్డి, రాధ కృష్ణ తదితర ప్రముఖులు పాల్గొని కళాకారులను అభినందించారు. నగర ప్రజలు, కళాభిమానులు ఈ ప్రదర్శనకు పెద్ద సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేశారు.




