Tirupati: ఘనంగా దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు: చింతా మోహన్!
Tirupati: పద్మావతి అమ్మవారి ఆలయంలో దళితుల ప్రవేశానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 13ను దళిత హక్కుల దినోత్సవంగా ప్రకటిస్తున్నట్లు చింతా మోహన్ తెలిపారు.
Tirupati: ఘనంగా దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు: చింతా మోహన్!
Tirupati: తిరుచానూరు, అక్టోబర్ 13 (ఆశాజ్యోతి న్యూస్) భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 1925 అక్టోబర్ 13వ తేదీ అంటరానివాడు దళితుడు దాసరి మురుగన్ అనే వ్యక్తి హిందూ దేవాలయం తిరుచానూరు అమ్మవారి దేవాలయం లోకి ప్రవేశించడం జరిగిందని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ తెలిపారు. దేవాలయ ప్రవేశం జరిగి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అక్టోబర్ 13ను. దళిత హక్కుల దినోత్సవం గా ప్రకటిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేటి నుండి 2027 అక్టోబర్ 13 వరకు దళిత దేవాలయ ప్రవేశ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో పలువురు దళితులతో కలిసి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన తిరుచానూరు తోలప్ప గార్డెన్లో మీడియాతో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో దళితులకు ఇది ఎంతో శుభదినం అని అన్నారు.
100 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా 1925 అక్టోబర్ 13వ తేదీ చిన్నప్ప కుమారుడు దాసరి మురుగన్ అనే పంచముడు అంటరానివాడు దళితుడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రవేశం చేయడం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో అగ్రవర్ణాలకు చెందిన. వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయనను పోలీసులు అరెస్టు చేసి తిరుపతి సబ్ జైల్లో ఉంచారని అన్నారు.. విషయం తెలుసుకున్న రాజగోపాలచారి. తిరుపతికి వచ్చి న్యాయస్థానంలో రామస్వామి అయ్యార్ ముందు వాదోపవాదాలు చేసే ఆయనకు శిక్ష లేకుండా చేయడం జరిగిందని అన్నారు.
అనంతరం రాజగోపాల్ ఆచారి తిరుపతిలో జరుగుతున్న కులం వివక్షపై మహాత్మా గాంధీకి జాబు రాయడంతో ఆయన వెంటనే స్పందించి మహాత్మా గాంధీ నేరుగా తిరుచానూరు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని ఆలయం ప్రధాన ద్వారం వద్ద. అంటరానితనం నిర్మూలనకై సత్యాగ్రహం చేసి 33మంది దళితులతో ఆలయ ప్రవేశం చేశారని పేర్కొన్నారు.
నేడు దేశంలో 30 కోట్ల మంది దళితులు ఉన్నప్పటికీ వారికి సామాజికంగా. ఆర్థికంగా. రాజకీయంగా అన్ని విధాలా అన్యాయం జరుగుతుందని వీటన్నిటిని అధిగమించేందుకు అక్టోబర్ 13న దళిత హక్కుల దినోత్సవం గా ప్రకటిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో దళితులకు ఎలాంటి అన్యాయం జరిగినా వాటి పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.




