Tiruchanur: విద్యార్థుల భవిష్యత్తులో తల్లిదండ్రుల పాత్ర కీలకం

Tiruchanur: తిరుచానూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. విద్యార్థుల చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని డీఈఓ కె.వి.ఎన్. కుమార్ సూచించారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 29 Sept 2026 8:21 PM IST
Tiruchanur
X

Tiruchanur: విద్యార్థుల భవిష్యత్తులో తల్లిదండ్రుల పాత్ర కీలకం

తిరుచానూరు: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పాఠశాలలతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ అన్నారు. పాఠశాల విద్యా ప్రగతికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు.

తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్.ఎం.సి) పునర్వ్యవస్థీకరణ ఎన్నికల కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్.ఎం.సి. ల ద్వారా తల్లిదండ్రులు పాఠశాల కార్యకలాపాలను అర్థం చేసుకోవడంతో పాటు, విద్యార్థుల అభ్యసన స్థాయి, హాజరు, విద్యా పురోగతిపై దృష్టి సారించాలని కోరారు.

పాఠశాల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి ఉపాధ్యాయులతో కలిసి పనిచేయాలని సూచించారు. ఇంటి వద్ద కూడా పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ అన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్లను ఎంతవరకు, ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు. విద్యార్థులను మాదకద్రవ్యాలు తదితర చెడు వ్యసనాలకు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తక జ్ఞానంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చడంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని డీఈఓ పేర్కొన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల చదువును తమ బాధ్యతగా భావించి పాఠశాలతో నిరంతరం అనుసంధానమై ఉండాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి సుమారు 300 మంది విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కాగా 6 నుంచి 12 తరగతులలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో 18 మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకుని వారిలో ఎం. గౌరీ ని చైర్మన్గా, కె. హరి ని వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు మురళి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు వాసు,వెంకటముని, లీలా ప్రతాప్, ఎస్.ఎం.సి. సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL