Tiruchanur: తిరుచానూరు పద్మావతి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీకదీపం సందర్భంగా నాలుగు మాడవీధుల్లో దీప ఊరేగింపు, ప్రత్యేక హారతులు వైభవంగా నిర్వహణ.
Tiruchanur: తిరుచానూరు పద్మావతి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీకదీపం పర్వదినాన్ని పురస్కరించుకొని కార్తీకదీప మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, పవిత్ర కార్తీకదీపాన్ని వెలిగించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ కార్తీకదీపాన్ని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
దీపకాంతుల నడుమ మాడవీధుల్లో సాగిన ఈ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఊరేగింపు అనంతరం ఆలయంలో ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ మహోత్సవంలో ఆలయ ఉన్నతాధికారులు, అర్చక బృందం, సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ శ్రీ హరి రావు, ఆలయ సూపర్డెంట్ ముని చెంగల్ రాయలు, ఇన్స్పెక్టర్లు, లక్ష్మీకాంత్,చలపతి తదితరులు పాల్గోన్నారు.




