Tiruchanur: పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగిన శ్రీకృష్ణ స్వామి
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
Tiruchanur: పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగిన శ్రీకృష్ణ స్వామి
తిరుచానూరు: శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణ స్వామి వారు శుక్రవారం సాయంత్రం పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు.
అనంతరం రుక్మిణి, సత్యభామ సమేత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు,ఏవిఎస్వో శ్రీహరి రావు, సూపరింటెండెంట్లు రమేష్, ముని చెంగల్రాయులు, సురేష్, అర్చకులు బాబు స్వామి, వేంపల్లి శ్రీనివాసులు స్వామి, ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.




