Tiruchanur: దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు!

Tiruchanur: తిరుచానూరు పరిధిలోని దామినేడులో 150 మందికి ర్యాపిడ్ డ్రగ్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు కౌన్సెలింగ్.

K VENU, TIRUPATHI RURAL
Updated on: 2 Aug 2026 9:08 PM IST
Tiruchanur
X

Tiruchanur: దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు!

తిరుచానూరు: తిరుచానూరు పోలీస్ స్టేషన్ సీఐ బి. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, ఎస్సైలు సుధాకర్, సిద్ధారెడ్డి మరియు సిబ్బంది కలిసి ఆదివారం దామినేడు ఇందిరమ్మ గృహాల వద్ద ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 150 మందికి ర్యాపిడ్ డ్రగ్ పరీక్షలు నిర్వహించారు.

డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడం, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచడం, ప్రజల్లో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుచానూరు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story