Tiruchanur: తిరుచానూరు పిఎస్‌లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా!

Tiruchanur: తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఐ సునీల్ కుమార్. దేశభక్తి శోభతో మిన్నంటిన వేడుకలు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 15 Aug 2026 5:29 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు పిఎస్‌లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా!

Tiruchanur: తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సునీల్ కుమార్ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు.

ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మహానుభావులు త్యాగఫలమే మనం స్వేచ్ఛ వాయువులను పీల్చగలుగుతున్నామని అన్నారు. ప్రతి ఒక్క దేశ పౌరుడు బాధ్యతతో కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్, సిద్ధారెడ్డి, అలియమ్మ ఏఎస్ఐలు శ్రీనివాసులు, బాబు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story