Tiruchanur: బంగారు తిరుచ్చి పై ఊరేగుతున్న శ్రీకృష్ణస్వామి

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణస్వామివారి జన్మనక్షత్రం ‘రోహిణి’ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.

K VENU, TIRUPATHI RURAL
Published on: 14 Jun 2026 9:20 PM IST
Tiruchanur
X

Tiruchanur: బంగారు తిరుచ్చి పై ఊరేగుతున్న శ్రీకృష్ణస్వామి

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణస్వామివారు ఆదివారం సాయంత్రం తిరుచ్చి పై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మనక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు.

సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారిని విశేషముగా అలంకరించి తిరుచ్చి పై మాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ మూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ మునిచెంగల్రాయులు, అర్చకులు బాబు స్వామి, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story