పద్మసరోవరంలో దివ్యంగా ముగిసిన శ్రీ పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఐదో రోజు సోమవారం పద్మసరోవరంలో ఏడు ప్రదక్షిణలతో అత్యంత వైభవంగా ముగిశాయి.
పద్మసరోవరంలో దివ్యంగా ముగిసిన శ్రీ పద్మావతీ అమ్మవారి తెప్పోత్సవాలు!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా ఐదువ రోజు సోమవారం పద్మసరోవరంలో శ్రీ పద్మావతీ అమ్మవారు తెప్పపై ఏడు చుట్లు విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలు, వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ ఉత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది.
అంతకుముందు అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం పుష్కరిణిలోని నీరాడ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు విశేషంగా అభిషేకం చేశారు. తెప్పోత్సవం అనంతరం అమ్మవారు గరుడ వాహనాన్ని అధీష్టించి మాడ వీధుల్లో ఊరేగారు.
పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎం. రవిచంద్ర, టీటీడీ జేఈవో డా. శరత్, సివీఎస్వో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్వో రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రమేష్, మునిచెంగల్రాయులు, సురేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంత్, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.




