Tiruchanur: తిరుచానూరులో ఘనంగా సూర్యనారాయణ స్వామి జన్మనక్షత్ర వేడుకలు!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణస్వామి వారి జన్మనక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.

K VENU, TIRUPATHI RURAL
Published on: 23 Jun 2026 8:54 PM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరులో ఘనంగా సూర్యనారాయణ స్వామి జన్మనక్షత్ర వేడుకలు!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీ సూర్యనారాయణస్వామి వారు మంగళవారం బంగారు తిరుచ్చి పై తిరుమాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మనక్షత్రం హస్త నక్షత్రము సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ సూర్యనారాయణస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచ్చి పై కొలువుదీర్చారు. అనంతరం విశేషాలంకరణలో విరాజిల్లుతున్న స్వామివారు తిరుచ్చి పై కొలువుదీరి నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు.

పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల‌య ఏవిఎస్వో రాధాకృష్ణమూర్తి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి తదితరులు పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story