Tirumala: తిరుమలలో నేత్రపర్వంగా భాగ్ సవారి ఉత్సవం!

Tirumala: తిరుమలలో ఘనంగా భాగ్ సవారి ఉత్సవం: అనంతాళ్వారు తోటకు శ్రీవారి అప్రదక్షిణ ప్రయాణం, పాల్గొన్న జీయంగార్లు, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 24 Sept 2026 7:23 PM IST
Tirumala
X

Tirumala: తిరుమలలో నేత్రపర్వంగా భాగ్ సవారి ఉత్సవం!

తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నిర్వహించే భాగ్ సవారి ఉత్సవం గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది.పురాణ ప్రాశస్త్యం ప్రకారం, భక్తాగ్రేసరుడైన అనంతాళ్వారుల భక్తిని పరీక్షించేందుకు శ్రీదేవి సమేతంగా స్వామివారు మానవ రూపంలో అనంతాళ్వారు పూదోటకు విచ్చేసినట్లు చెబుతారు.

ఈ సందర్భంగా జరిగిన సంఘటనల నేపథ్యంలో అనంతాళ్వారుల కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరుసటి రోజు స్వామివారు అప్రదక్షిణంగా తన తోటకు వచ్చి ఆలయానికి తిరిగి ప్రవేశిస్తారని విశ్వాసం. ఈ సంప్రదాయాన్ని అనుసరించి గురువారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు వైభవోత్సవ మండపం నుంచి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం తిరిగి ఆలయంలోకి ప్రవేశించడంతో భాగ్ సవారి ఉత్సవం ఘనంగా ముగిసింది.

అంతకుముందు పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకుల ఆధ్వర్యంలో నాళాయిర దివ్య ప్రబంధం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, పేష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA