Tirumala: బ్రహ్మోత్సవాలు చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీ మలయప్ప!

Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామి చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi
Published on: 13 Oct 2026 12:04 PM IST
Tirumala
X

Tirumala: బ్రహ్మోత్సవాలు చిన్నశేష వాహనంపై శ్రీకృష్ణుడిగా శ్రీ మలయప్ప!

Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో దివ్యదర్శనమిచ్చారు. ఐదు తలల చిన్న శేషవాహనంపై అధిరోహించి, తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

గోవింద నామస్మరణలు.. మంగళవాయిద్యాలు.. కోలాటాలు, చెక్కభజనల మారుమోగుతున్న నడుమ స్వామివారి వాహనసేవ కనులపండువగా సాగింది. చిన్నశేష వాహన దర్శనం ద్వారా కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ దివ్య వేడుకలో తిరుమల శ్రీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ పాల్గొన్నారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.