Tirumala: పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi
Published on: 12 Oct 2026 8:05 PM IST
Tirumala
X

Tirumala: పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

తిరుమల: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఏడుతలల స్వర్ణశేష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి అలంకారంలో స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

ఆదిశేషుడి పడగ నీడలో స్వామివారి వాహన సేవ కనులపండువగా సాగింది. ఇక మంగళవారం ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. వాహనసేవలో పెద్ద‌జీయ‌ర్‌స్వామి, చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Charan Kumar, Staff Reporter -Tirupathi

Charan Kumar, Staff Reporter -Tirupathi

11 ఏళ్లుగా ఆధ్యాత్మిక నగరి తిరుపతిలోని ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.