Tirumala: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం
Tirumala: సర్వాలంకార భూషితుడై స్వర్ణ గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామివారు.
Tirumala: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం
తిరుమల: పుణ్యక్షేత్రంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకలో శ్రీ మలయప్ప స్వామివారు సర్వాలంకార భూషితుడై స్వర్ణ గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. గరుడసేవ సందర్భంగా తిరుమల కొండలు భక్తుల గోవింద
నామస్మరణలతో మార్మోగాయి. వేలాది మంది భక్తులు మాడ వీధుల్లో బారులు తీరగా, స్వామివారి గరుడ వాహన దర్శనం కోసం గంటల తరబడి వేచి చూశారు. స్వామివారిని గరుడునిపై దర్శించుకోవడం సర్వపాప ప్రాయశ్చిత్తానికి దోహదపడుతుందనే విశ్వాసంతో భక్తులు భక్తి శ్రద్ధలతో సేవలో పాల్గొన్నారు.పౌరాణిక ప్రాధాన్యం కలిగిన గరుడ వాహన సేవకు వైష్ణవ సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది.గరుడ వాహనం ద్వారా భక్తుల పట్ల తన వాత్సల్యాన్ని, శరణాగతుల పట్ల తన కరుణను స్వామివారు చాటిచెబుతారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ పౌర్ణమి గరుడసేవ భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది.




