Tirumala: తిరుమలలో హెల్మెట్ నిబంధనలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్!

Tirumala: తిరుమలకు వచ్చే ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం అలిపిరి వద్ద పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 31 July 2026 7:41 AM IST
Tirumala
X

Tirumala: తిరుమలలో హెల్మెట్ నిబంధనలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్!

Tirumala: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చే భక్తులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని అలిపిరి సమీపంలో హెల్మెట్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

తనిఖీలలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 78 మంది వాహనదారులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.78,000 జరిమానా విధించారు.

అనంతరం వాహనదారులకు హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ రక్షణలో దాని ప్రాధాన్యత, మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించాలన్నారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI

Next Story