Thottambedu: కోడిపందేల కేసు కోర్టులో హాజరుపరిచిన 48 మంది ముద్దాయిలు

Thottambedu: తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలో కోడిపందేల కేసులో 48 మంది నిందితులను శ్రీకాళహస్తి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. మోటార్‌సైకిళ్ల అప్పగింత.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 23 July 2026 7:35 PM IST
Thottambedu
X

Thottambedu: కోడిపందేల కేసు కోర్టులో హాజరుపరిచిన 48 మంది ముద్దాయిలు

తొట్టంబేడు: వారం క్రితం తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కంచనపల్లి గ్రామ సమీపంలో నిర్వహించిన కోడిపందేలపై పోలీసులు చేపట్టిన దాడుల్లో పట్టుబడిన వివిధ మండలాలకు చెందిన 48 మంది ముద్దాయిలను ఈ రోజు, జూలై 23న, శ్రీకాళహస్తి ప్రత్యేక రెండో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం గౌరవ న్యాయమూర్తి వారికి జరిమానా విధించారు.

అనంతరం కేసులో స్వాధీనం చేసుకున్న 40 మోటార్‌సైకిళ్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, సంబంధిత యజమానులకు పోలీసులు అప్పగించారు.

ఈ సందర్భంగా తొట్టంబేడు ఎస్‌ఐ బాలకృష్ణ ముద్దాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి జూద కార్యకలాపాల్లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ జూదం కేసులు ఉన్న వారిపై జిల్లా బహిష్కరణ వంటి చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

జూదానికి దూరంగా ఉండి కుటుంబ సభ్యులతో కలిసి కష్టపడి జీవితంలో ఎదగాలని, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా జూదం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలిసినా వెంటనే 9440900724 లేదా 9440796763 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. నేర రహిత సమాజ నిర్మాణానికి ప్రజలంతా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story