Tirupati: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంబీయూ సంచలనం: 48 మందికి జాబ్స్

Tirupati: మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు ఇన్ఫోసిస్ క్యాంపస్ డ్రైవ్‌లో రూ.7-10 లక్షల వార్షిక ప్యాకేజీలతో 48 మంది ఉన్నత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

VENKATA RAMANA, CHANDRAGIRI
Published on: 5 Oct 2026 5:20 PM IST
Tirupati
X

Tirupati: క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంబీయూ సంచలనం: 48 మందికి జాబ్స్

తిరుపతి: మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో తమ ప్రతిభతో మరొకసారి సంచలనం సృష్టించారు. చంద్రగిరి మండలం, ఏ.రంగంపేట సమీపంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయానికి చెందిన 48 మంది విద్యార్థులు ఇటీవల జరిగిన నియామక ప్రక్రియలో అత్యంత ప్రతిష్టాత్మకమైన డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పి.వి. రమణ, రిజిస్ట్రార్ సారథి, కేరిర్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ కె. ఢిల్లీ బాబులు అధికారికంగా వెల్లడించారు.

​హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ హెచ్‌ఆర్ ప్రతినిధులు ఈ క్యాంపస్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. 2026,27 పాస్ అవుట్ విద్యార్థులకు మూడు రౌండ్ల పాటు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఫేస్-1 కింద 48 మంది విద్యార్థులు అర్హత సాధించగా, మరికొంతమంది విద్యార్థుల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఎంపికైన విద్యార్థులు సంవత్సరానికి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు భారీ వేతన ప్యాకేజీలు అందుకోనున్నట్లు యాజమాన్యం పేర్కొంది.

​విద్యార్థుల నిరంతర సాధన, అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యాలు, క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణమని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పివి రమణ గారు, రిజిస్ట్రార్ సారథి గారు తెలిపారు. నాణ్యమైన విద్యా బోధనతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంబీయూ ముందంజలో ఉందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని కొనియాడారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేలా ప్రతి దశలోనూ మార్గదర్శకత్వం వహించిన అధ్యాపకులు, శిక్షకుల పాత్ర ప్రశంసనీయమని యూనివర్సిటీ ఛాన్సలర్ పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు, ప్రో ఛాన్సలర్ మంచు విష్ణు అభినందించారు.

​ఈ సందర్భంగా ఎంబీయూ కెరీర్ డెవలప్‌మెంట్ సెంటర్ బృందం విజయం సాధించిన విద్యార్థులకు, వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన బోధనా సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

VENKATA RAMANA, CHANDRAGIRI

VENKATA RAMANA, CHANDRAGIRI