Renigunta: పీపీపీ విధానంలోకి తిరుపతి విమానాశ్రయం - కేంద్ర ప్రభుత్వ చర్యలు!

Renigunta: తిరుపతి విమానాశ్రయాన్ని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధం. తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్‌తో బండ్లింగ్.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 30 Sept 2026 1:15 PM IST
Renigunta
X

Renigunta: పీపీపీ విధానంలోకి తిరుపతి విమానాశ్రయం - కేంద్ర ప్రభుత్వ చర్యలు!

Renigunta: దేశంలోని 11 విమానాశ్రయాలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి విమానాశ్రయాన్ని తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంతో కలిపి (బండ్లింగ్) ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించేందుకు ప్రక్రియ ప్రారంభమైంది.

విమానాశ్రయాల నిర్వహణ, అభివృద్ధి, ఆధునికీకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా ప్రతిపాదనలు రూపొందించారు. వాణిజ్యపరంగా తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాన్ని,అధిక ప్రయాణికుల రద్దీ ఉన్న విమానాశ్రయంతో జత చేయడం ద్వారా మౌలిక వసతుల అభివృద్ధితో పాటు రిటైల్,కార్గో తదితర నాన్-ఏరోనాటికల్ ఆదాయాలను పెంచడమే బండ్లింగ్ విధానం ఉద్దేశంగా చెబుతున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు, పర్యాటకుల కారణంగా తిరుపతి విమానాశ్రయానికి ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం దేశంలోని పలు ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

ఈ ప్రతిపాదనలో విమానాశ్రయాల యాజమాన్యం AAI వద్దే కొనసాగుతుంది. నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలు మాత్రమే PPP విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానం అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియలో తదుపరి దశలపై చర్యలు కొనసాగుతున్నాయి.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA