Anjimedu: అంజిమేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Anjimedu: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం అంజిమేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
Anjimedu: అంజిమేడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
అంజిమేడు: తిరుపతి జిల్లా అంజిమేడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు.ఏర్పేడు మండలం పాగాలి పంచాయతీ కృష్ణంపల్లికి చెందిన మునిరత్నం రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియరాలేదు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.
Next Story




