Renigunta: రేణిగుంట సెంట్రల్ వేర్ హౌసింగ్‌లో ఈవీఎంల పరిశీలన

Renigunta: తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ రేణిగుంటలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 28 April 2026 4:17 PM IST
Renigunta
X

Renigunta: రేణిగుంట సెంట్రల్ వేర్ హౌసింగ్‌లో ఈవీఎంల పరిశీలన

Renigunta: ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.ఎస్ వెంకటేశ్వర్ జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24x7 నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎన్నికల కమీషన్ ఆదేశాల మార్గదర్శకాలు ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ నందు భద్రపరచబడిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్,సి డబ్ల్యూ సి గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను,

సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేసారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్ నందు సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి ఆర్ డి ఓ భాను ప్రకాష్ రెడ్డి, ఈవిఎం గోడౌన్ ఇంఛార్జి, జీఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భరత్ నాయక్, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ వై రమేష్ బాబు, రేణిగుంట తహసిల్దార్ శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story