Renigunta: ఓటరు మ్యాపింగ్ వేగవంతం చేయాలి తిరుపతి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
Renigunta: రేణిగుంట మండలంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్. పారదర్శకంగా సర్వే చేయాలని అధికారులకు ఆదేశం.
Renigunta: ఓటరు మ్యాపింగ్ వేగవంతం చేయాలి తిరుపతి కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్
రేణిగుంట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రేణిగుంట మండలం కరకంబాడి గ్రామం,తారకరామ నగరలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లో భాగంగా నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్రీ కాళహస్తి ఆర్ డి ఓ భాను ప్రకాశ్ రెడ్డి తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటికీ నిర్వహిస్తున్న సర్వే, ఓటర్ల వివరాల ధృవీకరణ, దరఖాస్తుల స్వీకరణ, అవసరమైన పత్రాల పరిశీలన తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ -2026 లో భాగంగా 2002 ఓటర్ల జాబితాలోని ఓటర్ల జాబితా కి ప్రస్తుత ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను నాణ్యమైన ఓటర్ల జాబితా తయారు చేయడమే లక్ష్యం అని తెలిపారు.
అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని,అర్హత లేని పేర్ల తొలగింపు, మార్పులు, చేర్పులు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మాత్రమే చేపట్టాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఓటరు నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని, ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని,ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో సర్వే పూర్తి చేసి ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారులు లు,బి ఎల్ ఎ లు పాల్గొన్నారు.




