Tirupati: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష!
Tirupati: తిరుపతి జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణ పనులను వేగవంతం చేయాలి: జేసీతో కలిసి సమీక్షించిన కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్. పరిహారం పంపిణీకి ఆదేశాలు.
Tirupati: జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులపై కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమీక్ష!
తిరుపతి: రైల్వే ప్రాజెక్ట్, భూసేకరణ, జాతీయ రహదారులు పనులు సంబంధించి పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికభద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మిని సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి భూ సేకరణ పనుల పై జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావుతో కలసి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశానికి తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్ డి ఓ లు రామ్మోహన్, భాను ప్రకాష్ రెడ్డి లు, టూరిజం ఆర్ డి రమణ ప్రసాద్, డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ జనార్థన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భారత్ నాయక్, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మీ, తహశీల్దార్లు, శ్రీసిటీ గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్ట్ పనులు, జాతీయ రహదారులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు, ఓబులవారిపల్లి, ఉప్పరపల్లి, పుల్లంపేట, కోడూరుకు సంబంధించి భూ పరిహారాలను త్వరితగతిన పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
భూ సేకరణకు సందర్భంగా ఆలయాలు, అటవీ భూముల పరిధిలోని భూముల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఏడీబి, విసిఐసి రోడ్డు నాయుడుపేట పనులు, ఏ పి ఐ ఐ సి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబందించిన పెండింగ్ కోర్టు కేసులను కూడా త్వరగా పరిస్కారం అయ్యేలా చూడాలన్నారు.
తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, విసిఐసి రోడ్డు, ఏపిఐఐసి ప్రాజెక్ట్స్, వైజాగ్ చెన్నై కారిడార్ పైపు లైను పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్న పనులను వేగవంతం చేయాలన్నారు. పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు.




